News March 26, 2025
కొడాలి నాని ఆరోగ్యంపై స్పందించిన ఆయన టీమ్

AP:వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వచ్చిన వార్తల విషయంలో ఆయన టీమ్ ట్విటర్లో స్పందించింది. ‘కొడాలి నాని గారు గ్యాస్ట్రిక్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన క్షేమంగా ఉన్నారు’ అని వెల్లడించింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News April 1, 2025
IPL: కేకేఆర్ చెత్త రికార్డ్

IPLలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థిపై ఎక్కువసార్లు ఓడిన జట్టుగా KKR నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆ జట్టు ముంబై ఇండియన్స్‌పై 10 సార్లు ఓడింది. ఈ క్రమంలో PBKS (కోల్‌కతాలో KKRపై 9 ఓటములు) పేరిట ఉన్న చెత్త రికార్డును చెరిపేసింది. మరోవైపు ముంబైపై కేకేఆర్ ఇప్పటివరకు 24 సార్లు ఓడింది. ఒకే ప్రత్యర్థిపై ఎక్కువసార్లు ఓడిన జట్టుగా నిలిచింది.
News April 1, 2025
పాఠశాల విద్యకు రూ.620 కోట్లు నిధులు

AP: పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దాదాపు రూ.620 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత విద్యాసంవత్సరంలో సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ ద్వారా ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యతో పాటు ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు నిర్వహించారు. వాటికి అయిన ఖర్చులకే తాజాగా నిధులు మంజూరయ్యాయి.
News April 1, 2025
ఏప్రిల్ 1ని ‘ఫూల్స్ డే’ అని ఎందుకంటారంటే?

ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1న ‘ఫూల్స్ డే’ నిర్వహిస్తారు. 16వ శతాబ్దం వరకు జూలియస్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 1ని న్యూఇయర్‌గా జరుపుకునేవారు. ఆ తర్వాత పోప్ గ్రెగోరీ VIII నూతన సంవత్సర వేడుకలను జనవరి 1కి మార్చారు. ఈ విషయం తెలియని ఫ్రాన్స్ ప్రజలు ఏప్రిల్ 1నే వేడుకలు జరుపుకున్నారు. దీంతో ఇతర ప్రాంతాలవారు వారిని ఫూల్స్‌గా ఆటపట్టించారు. అప్పటి నుంచి ఏప్రిల్ 1నాడే ‘ఫూల్స్ డే’ జరుపుకుంటున్నారు.