News March 26, 2025
KNR: సరైన అవగాహన.. సైబర్ నేరాలకు నివారణ

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై రైసింగ్ సన్ యూత్ క్లబ్ సహకారంతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈజీ మనీ కోసం ఆశపడి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ నడిపే వారితో పాటు బెట్టింగ్‌లో పాల్గొనే వారిపై నిఘా ఉంటుందని అన్నారు.
Similar News
News November 1, 2025
కరీంనగర్ సీపీఓగా పూర్ణచంద్రారావు అదనపు బాధ్యతలు

కరీంనగర్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (Chief Planning Officer – CPO)గా పనిచేసిన ఆర్. రాజారాం ఉద్యోగ విరమణ చేయడంతో, ఆ స్థానంలో మంచిర్యాల సీపీఓగా ఉన్న వి. పూర్ణచంద్రారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్థిక, గణాంకాల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వి. పూర్ణచంద్రారావు శుక్రవారం కరీంనగర్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు.
News November 1, 2025
నూతన ట్రాఫిక్ స్టేషన్ కార్యాలయాలను ప్రారంభించిన సీపీ

KNR ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనంలో నూతనంగా తీర్చిదిద్దిన ACP, CI, సిటీ రైటర్ కార్యాలయాలను CP గౌస్ అలాం శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DCP వెంకటరమణ, ACPలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరి స్వామి, వేణుగోపాల్, శ్రీనివాస్ జి, CIలు కరిముల్లా ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత మెరుగుపరచడానికి ఈ నూతన కార్యాలయాలు దోహదపడతాయని CP పేర్కొన్నారు.
News October 31, 2025
KNR: మైనారిటీ గురుకులాల్లో లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు

జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కరీంనగర్, మానకొండూర్, జమ్మికుంట గురుకులాల్లోని ఈ పోస్టులకు PG, B.Ed అర్హత ఉన్నవారు నవంబర్ 6వ తేదీ లోగా కరీంనగర్ జిల్లా మైనారిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.


