News March 26, 2025

భారత ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ ప్రశంసలు.. ఎందుకంటే!

image

భారత్ సహా కొన్ని వర్ధమాన దేశాల ఎన్నికల వ్యవస్థలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఇకపై దేశంలో ఓటు హక్కు నమోదుకు పౌరసత్వ పత్రాలను చూపాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ‘స్వపరిపాలనలో అత్యున్నతంగా ఉన్నప్పటికీ ఎన్నికల భద్రతలో వర్ధమాన దేశాలతో పోలిస్తే US విఫలమైంది. భారత్, బ్రెజిల్ వంటివి బయోమెట్రిక్‌ డేటాబేస్‌ (ఆధార్‌)తో ఓటరు గుర్తింపును ముడిపెట్టాయి’ అని ఆయన వివరించారు.

Similar News

News April 1, 2025

అంతరిక్షంలో ఉండటమే నాకు ఇష్టం: సునీత విలియమ్స్

image

అంతరిక్షంలో గడిపేందుకు తనకు ఎంతో ఇష్టమని నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అన్నారు. స్పేస్ నుంచి భూమిపై అడుగుపెట్టిన 12 రోజుల అనంతరం సునీతతోపాటు బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం అంతా బాగానే ఉంది. అంతరిక్షంలో ఉన్నంతకాలం ఉత్సాహంగా ఉన్నా. అక్కడ ఎన్నో సైన్స్ పరిశోధనలు చేశా. తిరిగి వచ్చేందుకు కృషి చేసిన డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌కు నా కృతజ్ఞతలు’ అంటూ ఆమె పేర్కొన్నారు.

News April 1, 2025

ఈ 3 నెలలు మంటలే.. జాగ్రత్త: IMD

image

ఈ ఏడాది APR-JUNE మధ్య దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు నమోదవుతాయని IMD వెల్లడించింది. AP, TG, UP, WB, TN, MP, రాజస్థాన్, గుజరాత్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, కర్ణాటకలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. విద్యుత్ డిమాండ్ 9-10% అధికంగా ఉంటుందని పేర్కొంది. గత ఏడాది మే 30న 250 గిగావాట్ల డిమాండ్ నమోదైన విషయం తెలిసిందే.

News April 1, 2025

నా పిల్లలు ఇండియాలోనే పెరగాలి: అమెరికన్ తల్లి

image

తన పిల్లలు భారతదేశంలో పెరిగితేనే ప్రయోజకులు అవుతారని ఓ అమెరికన్ తల్లి SMలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ ఈ పోస్ట్ పెట్టారు. ‘సంపాదనపరంగా US బెస్ట్ ఏమో కానీ.. సంతోషం మాత్రం భారత్‌లోనే దొరుకుతుంది. ఇక్కడ నివసిస్తే భావోద్వేగాలను హ్యాండిల్ చేయొచ్చు. లోతైన సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. సర్దుకుపోవడం అలవాటు అవుతుంది. కృతజ్ఞతాభావం పెరుగుతుంది’ అంటూ పేర్కొన్నారు.

error: Content is protected !!