News March 26, 2025
పాస్టర్ మృతిపై చంద్రబాబు విచారం.. విచారణకు ఆదేశం

AP: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు. అది హత్యేనని, ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తుండటంతో సీఎం స్పందించారు. ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 1, 2025
అంతరిక్షంలో ఉండటమే నాకు ఇష్టం: సునీత విలియమ్స్

అంతరిక్షంలో గడిపేందుకు తనకు ఎంతో ఇష్టమని నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అన్నారు. స్పేస్ నుంచి భూమిపై అడుగుపెట్టిన 12 రోజుల అనంతరం సునీతతోపాటు బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం అంతా బాగానే ఉంది. అంతరిక్షంలో ఉన్నంతకాలం ఉత్సాహంగా ఉన్నా. అక్కడ ఎన్నో సైన్స్ పరిశోధనలు చేశా. తిరిగి వచ్చేందుకు కృషి చేసిన డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌కు నా కృతజ్ఞతలు’ అంటూ ఆమె పేర్కొన్నారు.
News April 1, 2025
ఈ 3 నెలలు మంటలే.. జాగ్రత్త: IMD

ఈ ఏడాది APR-JUNE మధ్య దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు నమోదవుతాయని IMD వెల్లడించింది. AP, TG, UP, WB, TN, MP, రాజస్థాన్, గుజరాత్, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, కర్ణాటకలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. విద్యుత్ డిమాండ్ 9-10% అధికంగా ఉంటుందని పేర్కొంది. గత ఏడాది మే 30న 250 గిగావాట్ల డిమాండ్ నమోదైన విషయం తెలిసిందే.
News April 1, 2025
నా పిల్లలు ఇండియాలోనే పెరగాలి: అమెరికన్ తల్లి

తన పిల్లలు భారతదేశంలో పెరిగితేనే ప్రయోజకులు అవుతారని ఓ అమెరికన్ తల్లి SMలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ ఈ పోస్ట్ పెట్టారు. ‘సంపాదనపరంగా US బెస్ట్ ఏమో కానీ.. సంతోషం మాత్రం భారత్‌లోనే దొరుకుతుంది. ఇక్కడ నివసిస్తే భావోద్వేగాలను హ్యాండిల్ చేయొచ్చు. లోతైన సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. సర్దుకుపోవడం అలవాటు అవుతుంది. కృతజ్ఞతాభావం పెరుగుతుంది’ అంటూ పేర్కొన్నారు.