News March 26, 2025
నరసరావుపేట: ‘అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి’

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కోసం ప్రతిష్ఠాత్మకమైన ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యోగా అభివృద్ధికి అత్యుత్తమ సహకారం అందించిన, వ్యక్తులు సంస్థలు అర్హులని అన్నారు. https://innovateindia.mygov.in/pm-yoga-awards-2025/ ఆన్‌లైన్‌లో మార్చి 31లోగా పోర్టల్ ద్వారా, లేదా స్వయంగా దరఖాస్తులను సమర్పించాలన్నారు.
Similar News
News April 1, 2025
నాగర్‌కర్నూల్: అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. హీనంగా ప్రవర్తించారు..!

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో శనివారం రాత్రి యువతిపై 8 మంది దుండగులు సామూహిక అత్యాచారం చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మైకంలో 8 మంది వివాహితపై విచక్షణారహితంగా అత్యాచారం చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసి పశువుల కంటే హీనంగా ప్రవర్తించారనే ప్రచారం సాగుతోంది. పోలీసులు నిందితులపై కఠినంగా వ్యవహరించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.
News April 1, 2025
MHBD: ఘిబ్లీ ట్రెండ్.. వైరల్ అవుతున్న అనంతాద్రి దేవాలయం

మహబూబాబాద్ జిల్లాలో నెట్టింట వైరల్ అవుతున్న ఘిబ్లీ ఆర్ట్‌ను అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజలు ఆదరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన అనంతాద్రి ఆలయ చిత్రం ఇప్పుడు ఘిబ్లీ ఆర్ట్‌తో మహబూబాబాద్‌లో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ప్రజలకు చూపించేందుకు Way2News ప్రత్యేక చిత్రాన్ని తీసుకువచ్చింది. ఫొటో ఎలా ఉందో కామెంట్ చేయండి.
News April 1, 2025
పాలమూరు: ARMY జాబ్ కొట్టారు..!

నారాయణపేట జిల్లా బాపన్‌పల్లికి చెందిన గ్రామ యువకులు ఆనంద్, నవీన్, అనిల్, రవి ఆర్మీ జాబ్ సాధించారు. ఆర్మీ జాబ్ సాధించడంతో గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలోని యువకులందరూ గవర్నమెంట్ జాబ్స్ సాధించాలని తెలియజేశారు. ఆర్మీ జాబ్స్ సాధించి దేశానికి సేవ చేయడం ఎంతో ఆనందం కలిగించే విషయమని కొనియడారు.