News March 25, 2024

HYD: పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం 

image

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు..HYDయూసుఫ్‌గూడ పరిధి కార్మికనగర్ వాసి సాయిఈశ్వర్ కారు డ్రైవర్. ఓ బాలికను పెళ్లిచేసుకుంటానని చెప్పి తన తల్లితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి అడిగాడు. దీంతో బాలిక తల్లి తిరస్కరించింది. అయినప్పటికీ బాలిక వెంట పడుతూ నమ్మించి అత్యాచారం చేయగా ఆమె గర్భం దాల్చింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News September 9, 2025

హైదరాబాద్‌లో పోలీస్ క్రికెట్ స్టేడియం..!

image

హైదరాబాద్ నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో కొత్త క్రికెట్ స్టేడియం రానుంది. పోలీస్ క్రికెట్ స్టేడియం (పీసీఎస్) నిర్మాణంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దీని కోసం అంబర్‌పేట, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. అయితే ఆరాంఘర్‌లో స్టేడియం నిర్మిస్తే మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పీసీఎస్‌ను క్రికెట్ ఆడుకునే వారికి అద్దెకు ఇవ్వాలని కూడా యోచిస్తున్నారు.

News September 9, 2025

మాజీ సీఎం కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలి: రాజాసింగ్

image

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్న కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను వేరే చోటికి తరలిస్తే సాగర్‌ను మంచినీటితో నింపవచ్చని సూచించారు.

News September 9, 2025

గ్రంథాలయాలను బలోపేతం చేయాలి: డా. రియాజ్

image

తెలంగాణలోని అన్ని స్థాయిల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రియాజ్ విజ్ఞప్తి చేశారు. “మరో గ్రంథాలయ ఉద్యమం, పుస్తకంతో నడక” అనే కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకు నడక ర్యాలీని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వమే కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథాలయాలకు సరఫరా చేస్తే మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.