News March 26, 2025
అసెంబ్లీలో ప్రతిపక్షంపై సీఎం సీరియస్

TG: శాంతిభద్రతలపై ప్రతిపక్ష BRS దుష్ప్రచారం చేస్తోందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని చూస్తే కుదరదన్నారు. విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలోనే దిశ ఘటన, వామనరావు హత్య జరిగిందని తెలిపారు. <<15866506>>MMTS ఘటనపై<<>> వెంటనే స్పందించామని పేర్కొన్నారు.
Similar News
News April 1, 2025
నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. బాపట్లలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
News April 1, 2025
పాయింట్ల పట్టికలో అట్టడుగున డిఫెండింగ్ ఛాంపియన్స్

ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ నిరాశాజనక పర్ఫార్మెన్స్ చేస్తోంది. ఇప్పటివరకు 3 మ్యాచులాడి రెండింట్లో ఓడింది, ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగున నిలిచింది. మరోవైపు ఆర్సీబీ టాప్‌లోనే కొనసాగుతోంది. ఆ తర్వాత DC, LSG, GT, PBKS, MI, CSK, SRH, RR ఉన్నాయి. కాగా ఇవాళ కేకేఆర్‌పై విజయంతో ముంబై ఆరో స్థానానికి దూసుకెళ్లడం విశేషం.
News April 1, 2025
అంతరిక్షంలో ఉండటమే నాకు ఇష్టం: సునీత విలియమ్స్

అంతరిక్షంలో గడిపేందుకు తనకు ఎంతో ఇష్టమని నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అన్నారు. స్పేస్ నుంచి భూమిపై అడుగుపెట్టిన 12 రోజుల అనంతరం సునీతతోపాటు బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం అంతా బాగానే ఉంది. అంతరిక్షంలో ఉన్నంతకాలం ఉత్సాహంగా ఉన్నా. అక్కడ ఎన్నో సైన్స్ పరిశోధనలు చేశా. తిరిగి వచ్చేందుకు కృషి చేసిన డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌కు నా కృతజ్ఞతలు’ అంటూ ఆమె పేర్కొన్నారు.