News March 25, 2024

అధికారంలోకి రాగానే పోలీస్ రిక్రూట్‌మెంట్: లోకేశ్

image

AP: టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే పారదర్శకంగా పోలీస్ నియామకాలు చేపడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తెలిపారు. తాడేపల్లిలో ప్రచారంలో మాట్లాడుతూ.. ‘ఐదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు గొడవలు సృష్టిస్తారు. ఓర్పు, సహనంతో అందరూ ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.

Similar News

News October 3, 2024

డైరెక్ట్‌గా OTTలో రిలీజ్ కానున్న ‘ఇండియన్-3’?

image

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘భారతీయుడు-3’ సినిమాపై మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన ‘భారతీయుడు-2’ ఆశించిన మేర కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానున్న ‘ఇండియన్-3’ను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారని సినీవర్గాలు తెలిపాయి. OTT ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో ఇది స్ట్రీమింగ్ కానుందని పేర్కొన్నాయి.

News October 3, 2024

బహిరంగ క్షమాపణలు చెప్పాలి: వైజయంతి మూవీస్

image

సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైజయంతి మూవీస్ స్పందించింది. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మాణ సంస్థగా ఈ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వచ్చాం. జవాబుదారీతనం లేకుండా ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే సహించం. మా పరిశ్రమను, దాని సభ్యులను తక్కువ చేసి మాట్లాడిన వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. కలిసి నిలబడతాం’ అని ట్వీట్ చేసింది.

News October 3, 2024

నందిగం సురేశ్ రిమాండ్ పొడగింపు

image

AP: YCP మాజీ MP నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను మళ్లీ గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2021లో మంగళగిరిలోని TDP ఆఫీస్‌పై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ దాడిలో కార్యాలయంతోపాటు వాహనాలు, అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశాయి. వీడియోల ఆధారంగా పలువురిని అరెస్ట్ చేశారు.