News March 26, 2025
WGL: WOW సూపర్ ఐడియా.. సమ్మర్ స్పెషల్ ఆటో

మహబూబాబాద్ జిల్లాలో ఎండ వేడిని తట్టుకోవడానికి ఓ ఆటో యజమాని వినూత్నంగా ప్రయత్నించాడు. తన ఆటోలో పచ్చని చెట్లను అమర్చి ప్రయాణికులను ఆకర్షిస్తున్నాడు. ఇది చూసిన ప్రయాణికులు ఆ ఆటోను ఎక్కడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. పచ్చని చెట్లు లేకపోవడం వలనే ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అందరూ చెట్లను పెంచాలని ఆటోడ్రైవర్ ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాడు.
Similar News
News September 16, 2025
శుభ సమయం (16-09-2025) మంగళవారం

✒ తిథి: బహుళ దశమి రా.2.51 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర ఉ.10.33 వరకు
✒ శుభ సమయములు: సా.5.10-సా.6.10
✒ రాహుకాలం: మ.3.00-మ.4.30
✒ యమగండం: ఉ.9.30-మ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: రా.10.08-రా.11.38
✒ అమృత ఘడియలు: ఏమీ లేవు
News September 16, 2025
స్వస్త్ నారీ, సశక్త్ పరివార్‌ను సక్సెస్ చేయాలి: కలెక్టర్ తేజస్

‘స్వస్త్ నారి, సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
News September 16, 2025
మెదక్: రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్: హరీశ్‌రావు

కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బంద్ అయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఆపేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని ఆయన విమర్శించారు. డ్రామాలు కట్టిపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.