News March 26, 2025
ఎంపీ మిథున్‌రెడ్డిపై తొందరపాటు చర్యలొద్దు: హైకోర్టు

AP: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మద్యం కేసులో ఏప్రిల్ 3 వరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీ పోలీసులను ఆదేశించింది. అయితే ఎంపీకి ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు.
Similar News
News December 28, 2025
భారత్ ఖాతాలో మరో విజయం

శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న 5 T20ల సిరీస్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా జరిగిన 4వ T20లో IND 30 రన్స్ తేడాతో గెలిచింది. 222 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన SL 20 ఓవర్లలో 191/6 రన్స్‌కే పరిమితమైంది. ఓపెనర్లు ఆటపట్టు(52), పెరెరా(33) దూకుడుగా ఆడినా వారు ఔటయ్యాక రన్‌రేట్ పెరిగిపోవడంతో ఓటమిపాలైంది. IND బౌలర్లలో అరుంధతి, వైష్ణవి చెరో 2 వికెట్లు తీశారు. సిరీస్‌లో IND 4-0 లీడ్ సాధించింది.
News December 28, 2025
బ్యాడ్మింటన్‌లో గోల్డ్ సాధించిన చరిష్మ.. CBN, లోకేశ్ అభినందనలు

AP: విజయవాడలో జరిగిన 87వ యోనెక్స్ సన్‌రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2025 ఉమెన్స్ సింగిల్స్‌లో రాష్ట్రానికి చెందిన సూర్య చరిష్మ తమిరి గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్ షిప్‌లో ఆంధ్రా జట్టు సిల్వర్ గెలిచింది. తొలి గోల్డ్ మెడల్ సాధించిన చరిష్మ, సిల్వర్ గెలిచిన టీమ్‌ను CM చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ అభినందించారు.
News December 28, 2025
సీఎం రేవంత్ కీలక సమీక్ష.. వ్యూహం సిద్ధం!

TG: అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో CM రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో నదీజలాల పంపకం, TG వాటా, APతో వివాదాలు, BRS హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.


