News March 26, 2025
సహాయక చర్యలను పర్యవేక్షించిన ఎస్పీ

భద్రాచలంలోని పంచాయతీ ఆఫీసు దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనాస్థలానికి ఎస్పీ రోహిత్ రాజు హుటాహుటిన చేరుకున్నారు. ప్రమాద వివరాలను పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆయన.. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అటు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తుండగా.. వాటికింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.
Similar News
News July 6, 2025
NTR: కృష్ణా నదిలో భవిష్య స్కూల్ అధినేత డెడ్ బాడీ

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని భవిష్య స్కూల్ అధినేత శ్రీధర్ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఆయన మృతదేహాన్ని కృష్ణా నది నుంచి వెలికి తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమా.? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 6, 2025
సత్తెనపల్లి భవిష్య స్కూల్ అధినేత శ్రీధర్ ఆత్మహత్య

సత్తెనపల్లిలోని భవిష్య స్కూల్ అధినేత శ్రీధర్ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఆయన మృతదేహాన్ని కృష్ణా నది నుంచి వెలికి తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమా.? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 6, 2025
గుడిమల్కాపూర్ మార్కెట్ తరలింపునకు ఏర్పాట్లు?

నగరంలో అతిపెద్ద పూల మార్కెట్ గుడిమల్కాపూర్ మార్కెట్. రోజు రోజుకు రద్దీ పెరుగుతుండడంతో ఇరుకుగా మారుతోంది. ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో మార్కెట్‌ను నగర శివారుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు, పండ్లు, కూరగాయల అన్నిటికి వేదికగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 150 ఎకరాల స్థలం అవసరం ఉందని అంచనా వేసిన అధికారులు భూముల లభ్యతను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.