News March 26, 2025
మంచిర్యాల: నేటి పరీక్షకు 31 మంది గైర్హాజరు

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో జరిగిన గణిత శాస్త్రం పరీక్షకు 9,198 మంది విద్యార్థులకు గాను 9,178 విద్యార్థులు, గతంలో ఫెయిలైన 90 మంది విద్యార్థులకు గాను 79 మంది హాజరయ్యారు. మొత్తం 9,288 మందికి 9,257 విద్యార్థులు హాజరయ్యారని, 31 మంది గైర్హాజరైనట్లు డీఈవో యాదయ్య వెల్లడించారు.
Similar News
News November 9, 2025
జన్నారం: గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

జన్నారం మండలం బాదంపల్లి శివారులోని గోదావరిలో గల్లంతైన యువకుడు గుండా శ్రావణ్ మృతి చెందారు. శనివారం బాదంపల్లి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఫోటో దిగుతూ ప్రమాదవశాత్తు ఆయన గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం బాదంపల్లి శివారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. శ్రావణ్ మృతితో ఆయన కుటుంబంతో పాటు పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.
News November 9, 2025
కాగజ్‌నగర్: పేదలకు అందని కంటి వైద్యం

కాగజ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో కంటి వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం కంటి పరీక్షల కోసం సుమారు రూ.5 లక్షల విలువైన కంటి పరీక్ష యంత్రం (ఆప్టోమె ట్రిస్ట్) ఏర్పాటు చేసి వైద్యుడిని నియమించింది. 3 నెలల నుంచి యంత్రం మరమ్మతులో ఉంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కంటివైద్యం అందని ద్రాక్షగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
News November 9, 2025
కామారెడ్డి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి పూట విపరీతమైన చలి ఉండటంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు పొగ మంచు వల్ల వాహనాలను నడపలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటి నుంచే చలి మంటలు కాచుకుంటున్నారు.


