News March 26, 2025

మందమర్రి: కూతురితో తండ్రి అసభ్య ప్రవర్తన

image

కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు మందమర్రి SI రాజశేఖర్ తెలిపారు. యాపల్ ఏరియాకు చెందిన సతీశ్ తన 15 ఏళ్ల కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన భార్యను చేతులు, కర్రతో బాదాడు. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు SI వెల్లడించారు.

Similar News

News April 1, 2025

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో కీలక పరిణామం

image

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి గుంటూరు GGH సూపరింటెండెంట్ ప్రభావతి తప్పకుండా దర్యాప్తునకు సహకరించాలని సుప్రీం ఆదేశించింది. ఈ నెల 7, 8వ తేదీల్లో సంబంధిత PSలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సాకులు చూపుతూ ప్రభావతి దర్యాప్తునకు రావట్లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించగా.. 2 నెలల్లో ఒక్కసారే పిలిచారని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

News April 1, 2025

కృష్ణా: ఏప్రిల్ ఫూల్ చేశారా ఎవరినైనా.?

image

ఏప్రిల్ 1 వచ్చిందంటే పిచ్చి పనుల పండగే. ఒకరిని ఒకరు వంచించి, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకుంటూ నవ్వుల జల్లు కురిపించేవారు. 2010-12 వరకు ఏప్రిల్ ఫూల్ హంగామా రచ్చరచ్చగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లోనే మెసేజ్‌లతో సరిపెట్టుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా షాకింగ్ ఏప్రిల్ ఫూల్ అనుభవం వచ్చిందా.? కామెంట్ చేయండి..

News April 1, 2025

సత్యసాయి జిల్లాలో చిరుత పులి కలకలం

image

సత్యసాయి జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే .. గోరంట్ల మండలం ఎముకలగుట్టపల్లిలో సోమవారం రాత్రి పాడి ఆవుపై చిరుతపులి దాడి చేసింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!