News March 26, 2025

జగిత్యాల జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

image

జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు కొన్ని రోజులుగా చల్లగా ఉన్న వాతావరణం బుధవారం వేడెక్కింది. బుధవారం జిల్లాలోని బీర్పూర్ మండలం కొల్వాయిలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వెల్గటూర్, జగిత్యాల మండలాల్లో 36.6 డిగ్రీలు రాయికల్ మండలంలో 39.4, గొల్లపల్లిలో 39.2, బుగ్గారంలో 39.2, కోరుట్ల లో 39.2, మేడిపల్లిలో 39.1, ఇబ్రహీంపట్నం, సారంగాపూర్ మండలాల్లో 39.1 భీమారంలో 39.0, మేడిపల్లి లో 39.1 ఉంది.

Similar News

News January 1, 2026

కొత్త ఏడాదిలో మీ రెజల్యూషన్స్ ఏంటి?

image

కొత్త ఏడాదిలోకి గ్రాండ్‌గా అడుగు పెట్టేశాం. ఈ శుభ సందర్భంలో చాలా మంది రెజల్యూషన్స్ తీసుకుంటారు. ఉద్యోగం సాధించాలని, పొదుపు చేయాలని, మందు/ సిగరెట్ మానేయాలని, డైట్ ఫాలో కావాలని, జిమ్‌కు వెళ్లాలని, కొత్త ప్రదేశాలు చుట్టిరావాలని ఇలా తమకు నచ్చిన తీర్మానాలు చేసుకుంటారు. మీ రెజల్యూషన్స్ ఏంటి? గతేడాది పెట్టుకున్న గోల్స్‌ను పూర్తి చేశారా? కామెంట్ చేయండి.

News January 1, 2026

పాలు పితికేటప్పుడు ఈ తప్పు చేయొద్దు

image

కొందరు పాడి రైతులు పశువు నుంచి పాలను సేకరించేటప్పుడు పొదుగు నుంచి పూర్తిగా పాలను తీయకుండా కొన్నింటిని వదిలేస్తారు. ఇలా పొదుగులో మిగిలిపోయిన పాలలోకి బాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధికి కారణమవుతుందని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అలాగే పొదుగుకు అయ్యే చిన్న గాయాలకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పొదుగులోకి వ్యాపించి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

News January 1, 2026

హరిహరులను కొలిచేందుకు నేడే సరైన సమయం

image

నేడు హరిహరులను కలిపి పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘గురువారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం. అలాగే ఈరోజు త్రయోదశి తిథి. ప్రదోష వ్రతం కూడా నిర్వహిస్తారు. శివారాధనకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఒకే రోజున అటు హరి, ఇటు హర.. ఇద్దరినీ పూజించే అరుదైన అవకాశం కలిగింది. భక్తులు ఈ శుభదినాన విష్ణు సహస్రనామ పారాయణతో పాటు శివాభిషేకం చేయడం అభీష్ట సిద్ధి పొందుతారు’ అని అంటున్నారు.