News March 26, 2025

బాపట్ల జిల్లాలో యువ రైతు ఆత్మహత్య

image

బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొమ్మినేనివారిపాలెంలో అప్పులు బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువ రైతు బ్రహ్మయ్య వ్యవసాయంలో భారీగా అప్పులు కావడంతో, గ్రామంలోని పంట పొలాల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకొని ఉదయాన్నే పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి వైద్యశాలకు తరలించారు.

Similar News

News September 16, 2025

పెద్దపల్లి: ‘మైక్రో బ్రూవరీ నోటిఫికేషన్ రద్దు చేయాలి’

image

రామగుండం కార్పొరేషన్‌లో మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా AIYF PDPL జిల్లా సమితి మంగళవారం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసింది. మద్యం వల్ల యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, ఇప్పటికే బెల్టు షాపులు, వైన్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రో బ్రూవరీ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని AIYF నాయకులు హెచ్చరించారు.

News September 16, 2025

నిర్మల్: ‘రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

image

పట్టణంలోని ప్రభుత్వ మాత, శిశు ఆసుపత్రిని కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మహిళా శక్తి క్యాంటీన్‌ను పరిశీలించిన కలెక్టర్, భోజనం నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు సేకరించారు. అనంతరం లాబొరేటరీ, స్కానింగ్ కేంద్రం, ఇన్‌వార్డు, అవుట్‌వార్డు, ఆపరేషన్ థియేటర్, ఓపి వార్డు, బాలింతల వార్డులను సందర్శించి రోగుల పరిస్థితి స్వయంగా పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.

News September 16, 2025

గుండెపోటుతో డోన్ ఆర్పీఎఫ్ ఎస్‌ఐ మృతి

image

డోన్‌ రైల్వే స్టేషన్‌‌లో విషాదం నెలకొంది. ఆర్పీఎఫ్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ నాయక్ గుండెపోటుతో మృతిచెందారు. సామాజిక సేవలోనూ ముందుండే లక్ష్మణ్ నాయక్ మరణ వార్త కుటుంబ సభ్యులు, సహచరులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.