News March 26, 2025
బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేట్ల తగ్గింపు!

బ్యాంకులు APR నుంచి డిపాజిట్ వడ్డీరేట్లను తగ్గించొచ్చని సమాచారం. క్రెడిట్ డిమాండ్ సులభతరం కావడం, RBI మళ్లీ వడ్డీరేట్లను కత్తిరించే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని విశ్లేషకుల అంచనా. FEBలో 25BPS మేర కత్తిరించినప్పటికీ అత్యధిక డిపాజిటర్లు వెళ్లిపోతారేమోనన్న ఆందోళనతో బ్యాంకులు వడ్డీని తగ్గించలేదు. తాజాగా ద్రవ్యోల్బణం 3.6%కు చేరడం, RBI మానిటరీ పాలసీ సమావేశం సమీపిస్తుండటంతో ఇక కోత తప్పదని తెలుస్తోంది.
Similar News
News April 1, 2025
మీరు ఫూల్ అయ్యారా ఫ్రెండ్స్!

మన స్కూల్ డేస్‌లో ఏప్రిల్ 1 వస్తుందంటే ఎవరిని ఎలా ఫూల్ చేయాలా అని ప్లాన్ చేసేవాళ్లం. ఇక ఆ రోజు.. గోడమీద బల్లి, నీ డ్రెస్‌పై ఏదో పడింది, మీ వాళ్లు వస్తున్నారు, నిన్ను పిలుస్తున్నారు.. అని ఆ ఏజ్‌లో మనలోని చాణక్య చతురతతో అవతలి వారిని నమ్మించి ‘ఏప్రిల్ ఫూల్..’ అని ఆనందించాం. ఇప్పుడు నిజ జీవితంలో కొందరి చేతిలో ఫూల్ అవుతున్నాం.. అది వేరే అనుకోండి. ఫూల్స్ డేతో మీకున్న మెమోరీస్, ఫీలింగ్స్ కామెంట్ చేయండి.
News April 1, 2025
దుమ్మురేపుతున్న ‘మ్యాడ్ స్క్వేర్’ కలెక్షన్లు

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ కలెక్షన్లలో అదరగొడుతోంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.69.4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్లలో నవ్వులు.. థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు’ అని రాసుకొచ్చింది. MADకు సీక్వెల్‌గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
News April 1, 2025
గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కేంద్రానికి బీజేపీ ఎంపీల వినతి

TG: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు రాజ్యసభలో కె.లక్ష్మణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరారు.