News March 26, 2025
BREAKING: UPI సర్వర్ డౌన్

దేశవ్యాప్తంగా యూపీఐ సర్వర్ డౌన్ అయ్యింది. పేమెంట్లు చేయడానికి వీలు కావట్లేదని, కనీసం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడమూ సాధ్యం కావట్లేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. UNABLE TO LOAD ACCOUNT అనే మెసేజ్ వస్తోందంటూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లు ఫొటోలను షేర్ చేస్తున్నారు. పేమెంట్లు మధ్యలోనే నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. మీకూ ఇలాగే అయ్యిందా? కామెంట్ చేయండి.
Similar News
News September 17, 2025
సామాన్యుల నాయకుడు బద్దం ఎల్లా రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లికి చెందిన బద్దం ఎల్లా రెడ్డి నిజాం నవాబుకు వ్యతిరేకంగా KNR జిల్లాలో జరిగిన సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారు. రైతులు, సామాన్య ప్రజలను సంఘటితం చేసి వారికి నాయకత్వం వహించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి నిజాం నిరంకుశ పాలనను ధైర్యంగా ఎదిరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన జీవితాంతం కృషి చేశారు. సాయుధ పోరాటంలో 3 సం.రాలు జైలు శిక్ష అనుభవించారు.
News September 17, 2025
పలు శాఖల పనితీరుపై సీఎం ఆగ్రహం

AP: హోం, మున్సిపల్, రెవెన్యూ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలు తేల్చాయని కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. హోంశాఖ, మున్సిపల్ శాఖలు సరిగా పనిచేయడం లేదని తనకు ఫీడ్‌బ్యాక్ వచ్చిందన్నారు. అన్నిశాఖల మంత్రులు, అధికారులు ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
News September 17, 2025
అమరావతిలో క్వాంటం వ్యాలీ.. ఆకృతి ఇదే!

AP: అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. నిన్న కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించిన కట్టడాల ఆకృతినే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాలీ కోసం 50ఎకరాలు కేటాయించగా, ప్రధాన భవనాన్ని అమరావతి ఆకృతి(A)లో నిర్మించనున్నట్లు సమాచారం. సాధారణంగానే పునాదులు నిర్మించి, మిగిలిన కట్టడాన్ని ప్రీ ఇంజినీరింగ్ సాంకేతికతతో వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.