News March 26, 2025

వనపర్తి: ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ: బచ్చు రాము

image

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుందని జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షుడు బచ్చు రాము అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రేషన్ డీలర్ల సమావేశంలో బచ్చు రాము మాట్లాడుతూ.. ఉగాది పండుగ నుంచి ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేయనుందని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, డీఎస్ఓ, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 9, 2026

పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను సత్వరమే పంపిణీ చేయాలని కలెక్టర్‌ కృతికా శుక్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకతతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

News January 9, 2026

తెనాలి: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష

image

తెనాలి (M) నందివెలుగు వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన ఫిరంగిపురానికి చెందిన ఉయ్యాల తిరుపతయ్యకు 3 నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ తీర్పు ఇచ్చారు. 2022లో అప్పటి రూరల్ SI CH వెంకటేశ్వర్లు నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు 60 బస్తాల PDS బియ్యంతో పట్టుబడగా, శుక్రవారం కేసు విచారణకు వచ్చింది. APP సునీల్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.

News January 9, 2026

గంజాయి అమ్మకాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో గంజాయి అమ్మకాలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన నార్కోటిక్స్ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్‌లో జరిగింది. జిల్లాలో ఎక్కడా గంజాయి, మాదకద్రవ్యాల అమ్మకాలు జరగరాదన్నారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచి అమ్మకాలను నియంత్రించాలన్నారు.