News March 25, 2024

టికెట్లు దొరికితే ఒట్టు..

image

సొంతగడ్డ HYDలో ఐపీఎల్ మ్యాచ్ చూడాలనుకునే అభిమానులకు నిరాశే మిగులుతోంది. ఈనెల 27న జరిగే హైదరాబాద్-ముంబై మ్యాచ్ టికెట్లు చాలా మందికి దొరకలేదు. తాజాగా SRH-CSK టికెట్లు పెట్టిన కొద్దిసేపట్లోనే అందుబాటులో లేకుండా పోయాయి. పూర్తి కోటా టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచట్లేదని, బ్లాక్ చేస్తున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Similar News

News March 12, 2026

ఇవాళ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. అర్హతలివే

image

గుంటూరులోని ANUలో ఇవాళ AP, ఈ నెల 15న TG అభ్యర్థులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయులో ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత యువకులు అర్హులు. ఇంటర్/రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, 6 జిరాక్స్ కాపీలు, ఆధార్, 10 పాస్ పోర్టు కలర్ ఫొటోలు తీసుకువెళ్లాలి. 6AM-10AM లోపు ANUకు చేరుకోవాలి.

News March 12, 2026

త్వరలో మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి?

image

టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవతో ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్ ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్. ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా ఇటీవల విజయ్-రష్మిక, అల్లు శిరీష్-నయనిక వివాహాలు జరగగా, త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్-కావ్యా రెడ్డి ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే.

News March 12, 2026

16న ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

image

AP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర స్థాయి, అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. జిల్లాల స్థాయిలో వచ్చే 5 రోజుల్లో కలెక్టర్లు తమకు అనువైన రోజున ఇఫ్తార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.