News March 26, 2025
మా జోలికి వస్తే ఎవరినైనా వదలబోం: నాటో

పోలాండ్ సహా అన్ని సభ్యదేశాల భద్రతకు నాటో కట్టుబడి ఉందని సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చెప్పారు. తమ జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించారు. తమపై దాడి చేసి తప్పించుకోగలమని అనుకుంటే పెద్ద తప్పిదమే అవుతుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా-అమెరికా మధ్య సానుకూల చర్చలు జరుగుతున్న వేళ రుట్టే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Similar News
News January 27, 2026
సింగర్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్.. షాక్‌లో ఫ్యాన్స్!

బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ అర్జిత్ సింగ్ ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్లేబ్యాక్ సింగింగ్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ‘తుమ్ హి హో’, ‘కేసరియా’ వంటి మెలొడీలతో మెప్పించిన ఆయన 2 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ప్రభుత్వం నుంచి పద్మశ్రీ గౌరవాన్నీ పొందారు. సినిమాల్లో ఆయన గొంతు మూగబోతుందన్న వార్త సంగీత ప్రియులను కలచివేస్తోంది. తెలుగులో మనం, ఉయ్యాలా జంపాలా, స్వామి రారా సహా పలు చిత్రాలకు పాడారు.
News January 27, 2026
భారత్ ఘన విజయం

ఐసీసీ U19 <<18975279>>వన్డే వరల్డ్ కప్<<>> సూపర్-6లో జింబాబ్వేపై 204 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే 148 పరుగులకే ఆలౌటైంది. టీమ్ ఇండియా బౌలర్లలో ఉదవ్ మోహన్, ఆయుష్ మాత్రే చెరో 3 వికెట్లు, అంబ్రిష్ 2, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ తలో వికెట్ తీశారు.
News January 27, 2026
APSRTCలో 7,673 ఉద్యోగాలు!

APSRTCలో 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి భర్తీకి అనుమతించాలని పాలక మండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. వీటిలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ ఖాళీలు ఉన్నాయి. అలాగే ఆన్‌కాల్ డ్రైవర్‌ల వేతనాన్ని ₹800 నుంచి ₹1,000కి, డబుల్ డ్యూటీ చేసే కండక్టర్‌లకు ఇచ్చే మొత్తాన్ని ₹900కు పెంచనున్నారు. బుధవారం జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం వెలువడనుంది.


