News March 26, 2025

IPL-2025: KKR టార్గెట్ ఎంతంటే?

image

గువాహటిలో జరుగుతున్న మ్యాచ్‌లో KKRపై RR 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లెవరూ 30+ పరుగులు చేయకపోవడంతో రన్‌రేట్ నెమ్మదిగా కదిలింది. హసరంగా(4)ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపడం వర్కౌట్ అవ్వలేదు. జురెల్ 33 పరుగులతో రాణించారు. చివర్లో ఆర్చర్ 2 సిక్సులతో మెరిశారు. వైభవ్ అరోరా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలో 2 వికెట్లు తీశారు. KKR టార్గెట్ 152 పరుగులు.

Similar News

News April 1, 2025

వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

image

AP: వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉ.5.30 గంటలకే బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు వేసవిలో రద్దీని దృష్టిలో పెట్టుకొని సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.

News April 1, 2025

NSE విలువ రూ.410 లక్షల కోట్లు

image

NSE (నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్) లోని 2,710 కంపెనీల మార్కెట్ విలువ రూ.410.87 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది మార్చి 31 నాటికి ఎన్ఎస్ఈ విలువ రూ.384.2 లక్షల కోట్లుగా ఉంది. అలాగే గత నెల 28నాటికి NSEలో ఇన్వెస్టర్ల సంఖ్య 11.3 కోట్లుగా ఉంది. వీరిలో ఏపీ నుంచి 51 లక్షలు, టీజీ నుంచి 27 లక్షల మంది ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి 3 సంస్థలు ఐపీఓలకు వచ్చి రూ.6,283 కోట్లు సమీకరించాయి.

News April 1, 2025

‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డ్

image

హీరో నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన IND చిత్రాల్లో బుక్‌మై షో పబ్లిక్ రేటింగ్ 9.5 సాధించిన మూవీగా నిలిచింది. రూ.10 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అలాగే USలో మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శిని, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు.

error: Content is protected !!