News March 26, 2025
రేపటి నుంచి జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్

TG: HYD గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రేపటి నుంచి ఈ నెల 29 వరకు నాలుగో జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్ జరగనుంది. సీనియర్, అండర్ 21, పారా కేటగిరీల్లో పోటీలను నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీలను ప్రారంభిస్తారు. 29న ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొని బహుమతులు ప్రదానం చేస్తారు.
Similar News
News April 1, 2025
NSE విలువ రూ.410 లక్షల కోట్లు

NSE (నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్) లోని 2,710 కంపెనీల మార్కెట్ విలువ రూ.410.87 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది మార్చి 31 నాటికి ఎన్ఎస్ఈ విలువ రూ.384.2 లక్షల కోట్లుగా ఉంది. అలాగే గత నెల 28నాటికి NSEలో ఇన్వెస్టర్ల సంఖ్య 11.3 కోట్లుగా ఉంది. వీరిలో ఏపీ నుంచి 51 లక్షలు, టీజీ నుంచి 27 లక్షల మంది ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి 3 సంస్థలు ఐపీఓలకు వచ్చి రూ.6,283 కోట్లు సమీకరించాయి.
News April 1, 2025
‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డ్

హీరో నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన IND చిత్రాల్లో బుక్‌మై షో పబ్లిక్ రేటింగ్ 9.5 సాధించిన మూవీగా నిలిచింది. రూ.10 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అలాగే USలో మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శిని, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు.
News April 1, 2025
అసదుద్దీన్‌తో సీఎం రేవంత్ ఇఫ్తార్ విందు

TG: హైదరాబాద్‌లో మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఆయనతోపాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా విందులో పాల్గొన్నారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం’ అని సీఎం పేర్కొన్నారు.