News March 26, 2025
IPLలో సరికొత్త చరిత్ర

IPL 2025 సరికొత్త జోష్‌తో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచుల్లో సగటున 3.9 బంతులకు ఫోర్, 9.9 బంతులకు సిక్సర్ నమోదైంది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో దూకుడుగా ఆడటం ఇదే తొలిసారి. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో కనీసం 20+ పరుగులు నమోదైన ఓవర్లు 20 ఉన్నాయి. ఇక ప్రారంభంలోనే SRH 286 పరుగులు చేసి 300 పరుగులు కొట్టేస్తామని ఇతర జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News April 1, 2025
ఏపీలో 3, 4 తేదీల్లో వర్షాలు

AP: రాష్ట్రంలో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. 3న రాయలసీమ, 4న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. మరోవైపు, నిన్న రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడులో 40.3°C ఉష్ణోగ్రత నమోదైంది.
News April 1, 2025
ఇలాంటివి ముంబైకే సాధ్యం

IPLలో కొత్త టాలెంట్‌ను పరిచయం చేయడంలో ముంబై ఇండియన్స్ పేరు మోసింది. ఈ సీజన్‌లో యంగ్ ప్లేయర్లు అశ్వనీ కుమార్, విఘ్నేశ్‌ల ఎంపికలో ముంబై స్కౌట్స్‌ది కీలక పాత్ర. వీరిద్దరూ అరంగేట్రంలోనే సత్తా చాటారు. గతంలో బుమ్రా, హార్దిక్ వంటి ప్లేయర్లను స్కౌట్స్ ఇలాగే ఎంపిక చేయగా వారి సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. దీంతో స్కౌట్స్ కంటపడితే టాలెంటెడ్ ప్లేయర్స్‌కు తిరుగుండదని MI ఫ్యాన్స్ అంటున్నారు.
News April 1, 2025
WAQF BILL: నేడు బీఏసీ మీటింగ్!

వక్ఫ్ సవరణ బిల్లును ఈ వారంలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) నేడు సమావేశం కానున్నట్లు తెలిసింది. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు, చర్చించేందుకు షెడ్యూల్ ఖరారు చేయనుంది. కాగా బిల్లుపై వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. వక్ఫ్ లా అనేది స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఉందని, దానిని సవరించడం చట్టవిరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు.