News March 26, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

❤MBNR: రేపు PUలో ఉగాది వేడుకలు
❤గద్వాల డిపో మేనేజర్‌కు సన్మానం
❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
❤ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల చలివేంద్రం
❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
❤నాగర్‌కర్నూల్‌లో క్షుద్ర పూజల కలకలం
❤మార్చి 31 వరకు పన్నులు చెల్లించండి:కలెక్టర్లు
❤ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్లు
❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

Similar News

News April 1, 2025

కాగజ్‌నగర్: ఈనెల 3న నర్సరీ పండ్ల తోటల వేలం

image

కాగజ్‌నగర్ మండలంలోని జంబుగా ఉద్యాన నర్సరీ మామిడిపండ్ల తోటలను ఈనెల 3న వేలం వేస్తున్నట్లు ఐటీడీఏ పీవో కుష్బూగుప్త ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం పాటలో (2025- 26- 27) మూడు సంవత్సరాలకు కలిపి వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తోటలో బంగన్పల్లి, దశేరి తోతపల్లి, రసాలు వంటి హైబ్రిడ్ రకాలు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 11 గంటలకు వేలంపాటలో పాల్గొనాల్సిందిగా కోరారు.

News April 1, 2025

జీవీఎంసీకీ ఆస్తి పన్ను రూపంలో రూ.510 కోట్లు

image

గ్రేటర్ విశాఖలో రూ.510కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు కలెక్టర్&ఇన్‌ఛార్జ్ కమీషనర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించిన ప్రజలకు, వసూళ్లలో పాల్గొన్న జోనల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 2023-24 సంవత్సరంకు గాను రూ.454కోట్లు వసూళ్లు చేయగా.. 2024-25లో రూ.510కోట్లు వసూళు చేయడం హర్షనీయమన్నారు.

News April 1, 2025

NLG: ఎల్ఆర్ఎస్‌కు స్పందన అంతంత మాత్రమే!

image

ఉమ్మడి జిల్లాలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీంకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే లభించింది. ఎల్ఆర్ఎస్ కింద మార్చి 31వ తేదీ వరకు ఫీజు చెల్లించే వారికి ప్రభుత్వం 25% రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్చి 29 వరకు 1418 ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఒక్క సోమవారం మాత్రం 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.

error: Content is protected !!