News March 27, 2025

విశాఖలో లులూ మాల్.. భూమి కేటాయింపు

image

AP: విశాఖపట్నంలో లులూ గ్రూప్ నిర్మించబోయే షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో 13.43 ఎకరాలను APIICకి బదలాయించాలని VMRDAకు ఆదేశాలు జారీ చేసింది. 2017లోనే లులూకు భూమి కేటాయించగా 2023లో గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ భూకేటాయింపులు చేయాలని APIICని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.

Similar News

News April 1, 2025

పీఎఫ్ విత్‌డ్రా లిమిట్ భారీగా పెంపు!

image

పీఎఫ్ విత్‌డ్రా లిమిట్‌ను పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.లక్షగా ఉన్న ఆటో సెటిల్‌మెంట్ రూ.5 లక్షలకు పెంచాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో 7.5 కోట్ల మంది EPFO ఖాతాదారులకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. విద్య, వివాహ, ఇంటి ఖర్చులకు అప్లై చేసుకున్న మూడు రోజుల్లో పీఎఫ్ డబ్బులు ఖాతాలో జమచేస్తోంది.

News April 1, 2025

తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ స్ట్రీమింగ్

image

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ OTT తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. కొన్ని రోజుల కిందటే ఇది అమెజాన్ ప్రైమ్‌ OTTలోకి రాగా, ఇవాళ్టి నుంచి తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది. యూత్ ఫుల్ లవ్ స్టొరీతో వచ్చిన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ఈ మూవీలో ప్రియాంకా మోహన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.

News April 1, 2025

కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

image

AP: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ప్రభుత్వ సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేస్తున్నారు. ఉదయం 8.40 గంటల వరకు 53.98 శాతం మేర, 34 లక్షల మందికి పైగా నగదు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, ఇవాళ ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనుండగా, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేయనున్నారు.

error: Content is protected !!