News March 27, 2025
VKB జిల్లాలో నేటి TOP NEWS..!

❤ VKB:బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బసవరాజ్ పటేల్ ❤VKB: 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలు:అదనపు కలెక్టర్ ❤రోడ్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన తాండూరు ఎమ్మెల్యే ❤మెరుగైన వైద్యం అందించాలి: పరిగి మాజీ ఎమ్మెల్యే ❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు ❤పరిగి:శ్రీ సత్య హరిచంద్ర వీధి నాటక ప్రదర్శన ❤మల్లికార్జున్ ఖర్గేను కలిసిన పరిగి ఎమ్మెల్యే.
Similar News
News October 28, 2025
జూబ్లీ బైపోల్: ప్రచారానికి రేవంత్.. మరి KCR?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను టీపీసీసీ ఖరారు చేసింది. అక్టోబరు 31 నుంచి ప్రచారం చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా BRS అధినేత కేసీఆర్ ప్రచారంచేసే తేదీలు ఖరారు కాలేదు. తమ బాస్ ప్రచారం చేస్తే సునీత గెలుస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రచారంపై పార్టీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.
News October 28, 2025
GNT: మిర్చి, పసుపు యార్డులకు 2 రోజులు సెలవు

మొంథా తుపాన్ ప్రభావం కారణంగా గుంటూరు మిర్చి యార్డుకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించారు. రైతులు సరుకు తీసుకురావద్దని మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసరావు సూచించారు. కమిషన్ ఏజెంట్లు రహదారులపై సరుకు నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే దుగ్గిరాల పసుపు యార్డుకు కూడా 2 రోజులు సెలవు ప్రకటించారు. రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.
News October 28, 2025
పల్నాడు: ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధిదారులకు మరో అవకాశం

పల్నాడు జిల్లాలో వివిధ కారణాల వల్ల 16,238 మంది పట్టాదార్ రైతులకు ఆధార్ సీడింగ్ కాలేదని అధికారులు గుర్తించారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఎంపికై, ఆధార్ కారణంగా నగదు పడని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ లబ్ధిదారులకు మీ సేవ కేంద్రాలలో ఆధార్ సీడింగ్‌కు సర్వీస్ ఛార్జి మినహాయింపు ఇస్తూ సీసీఎల్ఏ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.


