News March 27, 2025
క్రమశిక్షణ కమిటీని నియమించిన వైసీపీ

AP: ఐదుగురు సభ్యులతో వైసీపీ క్రమశిక్షణ కమిటీని ఆ పార్టీ చీఫ్ జగన్ నియమించారు. ఈ కమిటీకి శెట్టిపల్లి రఘురామిరెడ్డిని ఛైర్మన్‌గా, సభ్యులుగా తానేటి వనిత, కైలే అనిల్ కుమార్, వై.విశ్వేశ్వర రెడ్డి ఉండనున్నారు. అలాగే వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షులుగా కాకుమాను రాజశేఖర్‌ను నియమించినట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.
Similar News
News April 1, 2025
జీబ్లీ ట్రెండ్‌లో ప్రభాస్, తేజా, శేష్

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ట్రెండ్ ఫాలో అవడంలో ముందుంటామంటోంది. SMలో వైరలవుతోన్న జీబ్లీ ట్రెండ్‌లో తాము కూడా చేరుతున్నామంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ‘ది రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ జీబ్లీ పిక్ ఆకట్టుకుంటోంది. ‘మిరాయ్’లో సూపర్ యోధాగా తేజా సజ్జ, ‘తెలుసుకదా’లో సిద్ధూ & రాశి, ఏజెంట్ 116లో అడివిశేష్‌ల పోస్టర్లను ఎడిట్ చేసింది. మరి ఈ ట్రెండ్‌లో మీరూ పాల్గొన్నారా? COMMENT
News April 1, 2025
హైదరాబాద్‌లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్

TG: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో జర్మనీ దేశానికి చెందిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. లిఫ్ట్ ఇస్తామని ఆమెను కారులో ఎక్కించుకున్న దుండగులు మార్గంమధ్యలో ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 1, 2025
ఒత్తిడి వల్ల లంచ్ చేయలేదు: అశ్వనీ కుమార్

IPLలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 4 వికెట్లతో సత్తా చాటిన MI బౌలర్ అశ్వనీ కుమార్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలి మ్యాచ్ కావడం వల్ల ఒత్తిడితో లంచ్ చేయలేదని, కేవలం అరటి పండు తిన్నట్లు చెప్పారు. మంచి ప్రదర్శన ఇవ్వడానికి తాను కొంత ప్లాన్ చేసుకోగా, జట్టు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందన్నారు. షార్ట్ లెంగ్త్‌తో పాటు బ్యాటర్ల బాడీని టార్గెట్ చేస్తూ బంతులు వేయాలని కెప్టెన్ హార్దిక్ సూచించారని అశ్వనీ తెలిపారు.