News March 27, 2025
రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తులు స్వీకరించాలి: కలెక్టర్

యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు యువత పథకాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News January 13, 2026
పాలమూరు: పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య: SI

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్ ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. సంగాల గ్రామానికి చెందిన పవిత్ర (20), అదే గ్రామానికి చెందిన లక్ష్మన్న ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 11న పెళ్లి విషయంపై లక్ష్మన్న నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఉరివేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News January 13, 2026
తిరుమల: శ్రీవారి దర్శనానికి ఎంత టైమ్ పడుతోందంటే?

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 68,542 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా.. 22,372 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.98 కోట్లు ఆదాయం వచ్చిందని TTD వెల్లడించింది.
News January 13, 2026
అన్నమయ్య: నకిలీ బంగారం ముఠా.. గుట్టురట్టు..!

చిన్నమండెం మండలంలో నిర్వహించిన మెరుపు దాడిలో ఆరుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్ల అరెస్టయ్యారు. రూ.3 లక్షల నగదు, ఒక కారు, 2 కేజీల నకిలీ బంగారం, 170 మిల్లీగ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో వీరబల్లి, తమిళనాడుకు చెందిన నిందితులు ఉన్నారు. నకిలీ బంగారం విక్రయం, ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


