News March 27, 2025
28న కాకినాడలో ఇఫ్తార్ విందు: కలెక్టర్

కాకినాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు కలెక్టరు షాన్మోహన్ సగిలి తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కావున ప్రజా ప్రతినిధులు, ముస్లిం పెద్దలు, జిల్లా అధికారులు ఇఫ్తార్ విందుకు హాజరుకావాలని కలెక్టర్ కోరారు.
Similar News
News November 7, 2025
HCUలో 52 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో 52 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో Asst లైబ్రేరియన్, Asst రిజిస్ట్రార్, Sr అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, Jr ఆఫీస్ అసిస్టెంట్, Lab అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, PG, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://uohyd.ac.in/
News November 7, 2025
విద్యార్థులు తప్పక ఉచ్ఛరించాల్సిన 12 నామాలు

1.ఓం భారతి నమ:, 2.ఓం సరస్వతి నమ:,
3.ఓం శారదే నమ:, 4.ఓం హంసవాహినియే నమ:,
5.ఓం జగతే నమ:, 6.ఓం వాగేశ్వరి నమ:,
7.ఓం కుముదినే నమ:, 8.ఓం బ్రహ్మచారిణే నమ:,
9.ఓం బుద్ధిదాత్రే నమ:, 10.ఓం చంద్రకాంతే నమ:,
11.ఓం వార్దాయని నమ:, 12.ఓం భువనేశ్వరి నమ:
విద్యార్థులు రోజు ఉదయాన్నే స్నానం చేసి ఈ 12 నామాలను ఉచ్ఛరిస్తే జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, విద్య, కళలు, సృజనాత్మకత పెరుగుతాయని నమ్మకం.
News November 7, 2025
NLG: మెడికల్ కాలేజీలో.. నో ర్యాగింగ్!

నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎలాంటి ర్యాంగింగ్ జరగలేదని తమ విచారణలో తేలినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కళాశాల క్యాంపస్‌తో పాటు పలు చోట్ల పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఉన్నట్లు తెలిపారు.


