News March 27, 2025

స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

అల్లూరి జిల్లాలో రెండు మండల పరిషత్, ఒక పంచాయతీలో ఏర్పడిన ఖాళీలకు ఉపఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత ఎంపీడీవోలను కలెక్టర్ దినేశ్ కుమార్ బుధవారం ఆదేశించారు. రాజీనామాల వలన ఖాళీ అయిన జీ.మాడుగుల మండల అధ్యక్ష పదవి, గెమ్మెలి పంచాయతీ ఉప సర్పంచ్ పదవికి, సభ్యుని మృతి వలన ఏర్పడిన చింతూరు మండల కో-ఆప్షన్ సభ్యుని పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News January 15, 2026

పక్షిలా ఎగరాలి అంటే.. భీమవరం రండి..!

image

కాళ్ల మండలం పెదమీరంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘స్కైరైడ్ అడ్వెంచర్’ను బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా రైడ్ చేసి, గగన విహారం అద్భుతమైన అనుభవమని కొనియాడారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ప్రజలకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సాహస క్రీడను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

News January 15, 2026

నేడు మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి వరపూజ

image

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి వరపూజ మహోత్సవం గురువారం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మహేష్ తెలిపారు. స్వామి వారికి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు వరపూజ కత్రువు సంక్రాంతి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మేలో జరిగే నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేడు వరపూజ, నిశ్చయ తాంబూల స్వీకరణ ఉంటుందన్నారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరు కానున్నారు.

News January 15, 2026

ప,గో: న్యాయస్థానంలో ఉద్యోగ అవకాశాలు

image

ఉమ్మడి ప.గో లీగల్ సర్వీసెస్ అథారిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా జడ్జ్ శ్రీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఏలూరు జిల్లా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.