News March 27, 2025

2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి: మంత్రి నిమ్మల

image

పోలవరం ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రాజెక్టును సందర్శిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. 2027 డిసెంబర్‌కు పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, సీడబ్ల్యుసీ, పీపీఎలను సమన్వయపరుచుకుంటూ డిజైన్లకు అనుమతులు తీసుకుంటున్నామన్నారు.

Similar News

News September 18, 2025

శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.

News September 18, 2025

కాకినాడ: ఏపీలోనే తొలిసారిగా.. మన తలుపులమ్మ లోవలో..!

image

ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ ఆలయంలో రూ.4 కోట్లతో ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కొండప్రాంతం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు ఎస్కలేటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ సదుపాయం ఏర్పాటు చేస్తున్న మొదటి దేవాలయం తలుపులమ్మ లోవ కానుంది.

News September 18, 2025

ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 35 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.