News March 27, 2025
వరంగల్: డ్రగ్స్ వేర్ హౌస్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

వరంగల్ పట్టణంలో రంగశాయిపేట యూపీహెచ్‌సి ప్రాంగణంలో సెంట్రల్ డ్రగ్ వేర్ హౌస్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. అధికారులపై సిబ్బంది ఔషధాల స్టాక్, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించి, విధులకు గైరుహజరైన సూపర్వైజర్‌కు షో కాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 1, 2025
ఆందోళనలో ‘మావో’ కుటుంబాలు

ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలు నేలకొరుగుతున్నారు. ఇక్కడి నుంచి సుమారు 21 మంది కీలక నేతలు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న ఎన్ కౌంటర్లతో జిల్లాలోని వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఓరుగల్లు వాసులే ఉండడం గమనార్హం.
News April 1, 2025
స్టేషన్‌ఘన్‌పూర్: ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

ట్రాక్టర్ కొనివ్వలేదని ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సముద్రాల గ్రామానికి చెందిన బోధాసి సంతోష్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ట్రాక్టర్ కొనివ్వమని అడగగా.. ఇప్పుడు డబ్బులు లేవు కొన్ని రోజుల తర్వాత కొనిస్తామన్నారు. దీంతో క్షణికావేశంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News April 1, 2025
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. జనగామ జిల్లా మహిళా మృతి

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్‌లో జనగామ జిల్లాకు చెందిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మృతి చెందారు. రేణుకది దేవరుప్పుల మండలం కడవెండి. గ్రామంలో ఆమె మృతిపై తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమె మరణాన్ని నిరసిస్తూ భావోద్వేగంతో స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.