News March 27, 2025

ADB: శిక్షణ, ఉపాధి కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

అదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, మైనార్టీ యువకులకు టెలి హెల్త్ సర్వీస్ కోఆర్డినేటర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఉచిత భోజన వసతులతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండి ఆసక్తి గలవారు ఈ నెల 28న అన్ని ధ్రువీకరణ పత్రాలు, పాస్ ఫోటోలతో ఆదిలాబాద్ టీటీడీసీలో హాజరు కావాలని సూచించారు.

Similar News

News January 14, 2026

ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

image

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News January 13, 2026

ఆదిలాబాద్: రూ.90 పెరిగిన పత్తి ధర

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,710గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.90 పెరిగినట్లు వెల్లడించారు.

News January 12, 2026

ADB: రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా జమునా నాయక్

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని దానోరా (బి) సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. క్రమశిక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పాటు చేస్తానని జమునా నాయక్ పేర్కొన్నారు.