News March 25, 2024

సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులకు సీబీఐ నోటీసులు

image

AP: విశాఖ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సీబీఐ నోటీసులు పంపింది. కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి డేటా కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో పలువరు ఆక్వా బిజినెస్ ప్రతినిధులను కూడా సీబీఐ ప్రశ్నించనుంది. ఇప్పటికే సంధ్యా ఆక్వా కంపెనీలో తనిఖీలు జరిపిన సీబీఐ.. కంపెనీ వ్యాపార లావాదేవీలపై లోతుగా విచారణ చేస్తోంది.

Similar News

News March 21, 2026

మార్చి 21: చరిత్రలో ఈ రోజు

image

1857: జపాన్‌లో భారీ భూకంపం.. 100,000 మంది మృతి
1916: షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం
1970: నటి శోభన జననం(ఫొటోలో)
1978: బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ జననం
1990: అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి మరణం
2022: రంగస్థల నటుడు, దర్శకుడు తల్లావజ్జుల సుందరం మరణం
*ప్రపంచ అటవీ దినోత్సవం
*ప్రపంచ కవితా దినోత్సవం

News March 21, 2026

కీచక జ్యోతిషుడితో లింక్స్.. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాజీనామా

image

నాసిక్(MH) <<19426361>>జ్యోతిషుడు<<>> అశోక్ కారత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతడితో ఉన్న ఫొటోలు, లింక్స్ బయటపడటంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రూపాలి చకన్కర్ రాజీనామా చేశారు. అంతకుముందు ఆ పదవి నుంచి దిగిపోవాలని MH సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రూపాలి ఈ నెల 18 నుంచి ఆఫీసుకు వెళ్లడం లేదని తెలిసింది.

News March 21, 2026

తమిళనాడులో AIADMKదే పైచేయి?

image

తమిళనాడు ఎన్నికల్లో ఈసారి AIADMKదే పైచేయి అని IANS సర్వే పేర్కొనడం చర్చనీయాంశమైంది. AIADMK కూటమికి 39-40% ఓట్ షేర్ రావొచ్చని.. ఫలితంగా 234 స్థానాల్లో 114-127 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. DMK కూటమికి 104-114 సీట్లు (37-38% ఓట్ షేర్) దక్కొచ్చని పేర్కొంది. ఇక విజయ్ TVKకి 6-12 సీట్లు (14-15% షేర్) రావొచ్చని, అనేక స్థానాల్లో TVK కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చింది. <<-se>>#Elections2026<<>>