News March 27, 2025
TGలో ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ.. ఎక్కడంటే?

TG: రాష్ట్రంలో కొత్తగా ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీని ఎర్త్‌సైన్స్ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేయనుంది. వారం రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు విడుదల కానున్నాయి. వర్సిటీ ఏర్పాటుకు రూ.500 కోట్ల నిధులతో పాటు 100 పోస్టులు అవసరమని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
Similar News
News April 1, 2025
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో కీలక పరిణామం

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి గుంటూరు GGH సూపరింటెండెంట్ ప్రభావతి తప్పకుండా దర్యాప్తునకు సహకరించాలని సుప్రీం ఆదేశించింది. ఈ నెల 7, 8వ తేదీల్లో సంబంధిత PSలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సాకులు చూపుతూ ప్రభావతి దర్యాప్తునకు రావట్లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించగా.. 2 నెలల్లో ఒక్కసారే పిలిచారని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
News April 1, 2025
విద్యార్థినులను దుర్భాషలాడిన ప్రిన్సిపల్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

TG: వికారాబాద్‌లో ఓ ప్రిన్సిపల్ గురుకుల విద్యార్థినులను అసభ్య పదజాలం వాడుతూ కొట్టడంపై <
News April 1, 2025
మహిళపై గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు

TG: నాగర్ కర్నూల్ జిల్లాలో <<15944914>>మహిళపై గ్యాంగ్ రేప్<<>> ఘటనలో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఏడుగురు ఈ దారుణానికి ఒడిగట్టగా, దాదాపు 3 గంటలపాటు ఆమెను లైంగికంగా వేధించినట్లు చెప్పారు. దాహం వేస్తోందని బాధితురాలు మంచినీరు అడగగా మానవత్వం మరిచి నోట్లో మూత్రం పోసినట్లు తెలిపారు. కాగా నిన్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీరికి సహకరించిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.