News March 27, 2025
నేటితో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి

TG: రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. ఈ లిస్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశంతో పాటు ఎంఐఎం సభ్యుడు మీర్జారియాజ్ ఉల్ హసన్ అఫెంఢీ, టీచర్ ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మండలిలో వీరికి నేడు సన్మానం కార్యక్రమం జరగనుంది.
Similar News
News January 23, 2026
జగన్ ఖాతాకు శ్రీలంక VPN.. ‘X’ ఏం చెబుతోందంటే?

AP: వైసీపీ అధినేత జగన్ తన ‘X(ట్విటర్)’ ఖాతాకు శ్రీలంక VPN(వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన హ్యాండిల్‌లో ‘Account based in Sri Lanka’ అని చూపిస్తోందని నెటిజన్లు స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. అయితే ఈ డేటా కచ్చితమైనది కాకపోవచ్చని, ఇంటర్నెట్ ప్రొవైడర్లు యూజర్లకు తెలియకుండానే VPN వంటి ప్రాక్సీలను ఉపయోగించవచ్చని ‘X’ చెబుతోంది.
News January 23, 2026
రెండు వారాల్లో గ్రీన్‌లాండ్‌పై క్లారిటీ: ట్రంప్

గ్రీన్‌లాండ్ డీల్ విషయంలో పురోగతి కనిపిస్తోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయని.. మరో 2 వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతకొన్ని వారాలుగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ ఆయన హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఓ దశలో సైనిక చర్యకూ వెనకాడబోమని హెచ్చరించినప్పటికీ తర్వాత వెనక్కి తగ్గారు.
News January 23, 2026
రేషన్ బియ్యంతోపాటు నిత్యావసరాలు: ఉత్తమ్

TG: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రేషన్ బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులు అందించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినట్లుగానే నిత్యావసరాలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మరోవైపు 2025-26 వానాకాలం సీజన్‌లో 71.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు.


