News March 25, 2024
REWIND: 9 ఓట్లతో అనకాపల్లి ఎంపీగా గెలిచారు

అనకాపల్లి ఎంపీగా 1989లో కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. ఈ స్థానానికి 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఈ మెజార్టీనే అత్యల్పం. కొణతాల ప్రస్తుతం అనకాపల్లి జనసేన MLA అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వెంకట సత్యవతి 89,829 ఓట్ల మెజార్టీతో గెటిచారు. ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేశ్ బరిలో ఉండగా.. వైసీపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.
Similar News
News March 25, 2026
ఆంధ్రా యూనివర్సిటీలో ఘనంగా 91, 92వ స్నాతకోత్సవం

ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్రా యూనివర్సిటీ 91, 92వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకలో 441 మందికి పీహెచ్‌డీలు, 174 మెడల్స్ ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా పూర్ణచంద్రరావు సగ్గుర్తి, పతంజలి శాస్త్రి హాజరయ్యారు. కార్యక్రమంలో వీసీ రాజశేఖర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తమ పరిశోధనలు చేసిన పలువురు ఆచార్యులకు అవార్డులు అందజేశారు.
News March 25, 2026
విశాఖ: 28న జడ్పీ సర్వసభ్య సమావేశం

ఈనెల 28న స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఛైర్‌పర్సన్ అధ్యక్షతన ఉదయం10:30 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుందని జడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.