News March 27, 2025

IPL: నేడు SRHతో LSG ఢీ

image

HYD రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇవాళ రా.7.30కి SRH, LSG జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో భీకర ఫామ్‌లో ఉన్న SRH హిట్టర్లు మరోసారి రికార్డు బ్రేకింగ్ స్కోరు నమోదు చేసే అవకాశం ఉంది. LSG బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా కనిపిస్తుండడంతో గ్రౌండ్‌లో సిక్సర్ల వర్షం తప్పదేమో. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 4 మ్యాచుల్లో తలపడగా LSG 3, SRH 1 గెలిచింది. నేడు SRH 300 కొడుతుందా? COMMENT

Similar News

News January 15, 2026

వెంటనే USతో ట్రేడ్ డీల్ చేసుకోవాలి: థరూర్

image

ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ 25% సుంకాలు విధిస్తాననడంపై కాంగ్రెస్ MP శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు 50% సుంకాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారీ సుంకాలు చెల్లించి USకు ఎగుమతులు చేయడం ఏ భారతీయ కంపెనీకీ సాధ్యం కాదని.. మన వస్తువుల ధరలు పెరిగి పోటీలో వెనుకబడతామని థరూర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే USతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.

News January 15, 2026

ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు: రాజ్ ఠాక్రే

image

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు వాడుతున్నారని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. సిస్టమ్‌ను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికే ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడగకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.

News January 15, 2026

మీ ఇంటి గోవులను రేపు ఎలా పూజించాలంటే?

image

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.