News March 27, 2025
నేడు పోలవరం సందర్శనకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న ప్యానళ్ల పనులను, ఎగువ కాఫర్ డ్యామ్‌ను ఆనుకుని సీపేజీ నివారణకు సాగుతున్న బట్రెస్ డ్యామ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై సమీక్ష నిర్వహిస్తారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News April 1, 2025
గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కేంద్రానికి బీజేపీ ఎంపీల వినతి

TG: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు రాజ్యసభలో కె.లక్ష్మణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరారు.
News April 1, 2025
గిగ్ వర్కర్ల కోసం ‘AC రెస్ట్ రూమ్స్’

వేసవిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఫుడ్, ఆన్‌లైన్ డెలివరీలు చేస్తూ ఇబ్బందిపడే గిగ్ వర్కర్ల కోసం చెన్నై కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కాస్త ఉపశమనం కలిగించేందుకు చెన్నైలోని ప్రధాన రోడ్లపై ‘AC రెస్ట్ రూమ్స్’ను ఏర్పాటు చేయనుంది. స్విగ్గీ, జొమాటో, ఉబర్ డెలివరీ పార్ట్నర్స్ వీటిని ఉపయోగించుకోనున్నారు. ఈ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. HYDలోనూ ఇలాంటి ఏర్పాటు చేయాలని డిమాండ్ నెలకొంది.
News April 1, 2025
రోహిత్ కాబట్టే ఇంకా జట్టులో ఉన్నారు: వాన్

హిట్‌మ్యాన్ రోహిత్ IPLలో విఫలమవ్వడంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ విమర్శలు చేశారు. ప్రస్తుతం అతను కెప్టెన్ కాదని, కేవలం బ్యాట్స్‌మెన్ మాత్రమేనని పేర్కొన్నారు. రోహిత్ కాకుండా మరొకరు ఇలా తక్కువగా రన్స్ చేస్తే టీమ్ నుంచి బయటకు పంపేవారని చెప్పారు. అలాగని తాను రోహిత్‌ను టీం నుంచి డ్రాప్ కావాలని కోరుకోవట్లేదన్నారు. అయితే తిరిగి హిట్‌మ్యాన్ త్వరగా ఫామ్ అందుకొని జట్టుకు విజయాలు అందించాలని కోరారు.