News March 27, 2025
3 నెలలకోసారి జాబ్ మేళాలు: సీఎం

AP: అన్ని నియోజకవర్గాల్లో ప్రతి 3, 6 నెలలకోసారైనా జాబ్ మేళాలు నిర్వహించాలని కలెక్టర్లను CM చంద్రబాబు ఆదేశించారు. స్కిల్ సెన్సస్ ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యువతకు స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు ప్రతి జోన్‌కు ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలన్నారు. WFH విధానంలో వర్క్ చేసేందుకు రిజిస్టర్ చేసుకున్న వారికి ట్రైనింగ్ ప్రారంభించాలని సూచించారు.
Similar News
News April 1, 2025
HCU భూములు కాపాడాలని కేంద్రమంత్రికి వినతి

HCUకి చెందిన 400 ఎకరాల భూమిని కాపాడాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను రాష్ట్ర BJP MPలు కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మేరకు వినతిపత్రం అందించారు. పచ్చని చెట్లు, దట్టమైన అడవితో ఉన్న భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొన్నారు. జింకలు, నెమళ్లు, అరుదైన నక్షత్ర తాబేళ్లు, సరీసృపాలకు ప్రాణాధార చెరువులు ఉన్న ఈ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
News April 1, 2025
పంత్ ఫ్లాప్ షో.. రూ.27 కోట్లు.. 17 రన్స్

IPL హిస్టరీలోనే అత్యధిక వేతనం(రూ.27 కోట్లు) తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. 3 మ్యాచ్‌లలో 17 రన్స్(DCపై 0, SRHపై 15, PBKSపై 2) మాత్రమే చేశారు. దీంతో ఆ జట్టు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీపర్, కెప్టెన్‌గానూ ఆకట్టుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇతనొక ఓవర్ రేటెడ్ ప్లేయర్ అని ఫైరవుతున్నారు. తర్వాతి మ్యాచ్‌లలోనైనా పుంజుకోవాలని కోరుకుంటున్నారు.
News April 1, 2025
టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

APలో టెన్త్ పరీక్షలు ముగిశాయి. మార్చి 17న తెలుగు పరీక్షతో ప్రారంభమైన పరీక్షలు ఇవాళ సోషల్ స్టడీస్‌తో ముగిశాయి. 6.24 లక్షల మంది విద్యార్థులకు గాను 6.17 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమై ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత పలు దఫాల పరిశీలన అనంతరం మే రెండో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది.