News March 25, 2024
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ?

హీరోయిన్ తాప్సీ తన ప్రియుడు మథియాస్ బోను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 23న ఉదయ్‌పూర్‌లో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగినట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు ఈ పెళ్లి వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. మథియాస్‌తో గత పదేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు తాప్సీ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.
Similar News
News August 31, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. EC కీలక ఉత్తర్వులు

TG: సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిన్న రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం (EC) కార్యాచరణ ప్రారంభించింది. ‘MPTC, ZPTC స్థానాల్లో SEP 6న ముసాయిదా ఓటరు జాబితాలు ప్రచురించాలి. 6-8 వరకు వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించి 9న వాటిని పరిష్కరించాలి. 10న తుది ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలి’ అని కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
News August 31, 2025
ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలోనే!

AP: సాధారణంగా మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షలను ఈసారి FEBలో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సిద్ధమైంది. CBSEతో పాటు ఎగ్జామ్స్ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు తగినట్లు షెడ్యూల్‌లో మార్పులు చేసింది. తొలుత సైన్స్ స్టూడెంట్స్‌కు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు స్టార్ట్ అవుతాయి. తర్వాత లాంగ్వేజ్, చివర్లో ఆర్ట్స్ గ్రూప్ వారికి ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రాక్టికల్స్ నిర్వహణపై క్లారిటీ రావాల్సి ఉంది.
News August 31, 2025
అంచనాలకు మించి దూసుకెళ్తున్న భారత్

భారత ఎకానమీ అంచనాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో <<17555786>>GDP<<>> వృద్ధి రేటు 7.8% నమోదవడమే ఇందుకు నిదర్శనం. మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, సర్వీస్ సెక్టార్లు రాణించడం కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో అతిపెద్ద ఎకానమీగా ఉన్న భారత్ 2030 నాటికి మూడో స్థానానికి చేరుతుందని అధికారులు వెల్లడించారు. అప్పటివరకు జీడీపీ $7.3 ట్రిలియన్లకు చేరుతుందని తెలిపారు.