News March 27, 2025
ఆలూరు సాంబ శివారెడ్డికి వైఎస్ జగన్ కీలక బాధ్యతలు

శింగనమల నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఆలూరు సాంబ శివారెడ్డికి వైసీపీ కీలక పదవి కట్టబెట్టింది. ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్‌గా నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవి ఇచ్చిన అధినేతకు సాంబ శివారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తన మీద జగన్ ఉంచిన నమ్మకంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.
Similar News
News September 17, 2025
పాకిస్థాన్ మ్యాచులకు రిఫరీగా రిచర్డ్‌సన్!

ఆసియా కప్: షేక్‌హ్యాండ్ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ని తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఆసియా కప్ నుంచి తొలగించకపోతే తాము UAEతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ మ్యాచులకు పైక్రాఫ్ట్‌ను ICC దూరం పెట్టినట్లు తెలుస్తోంది. UAEతో మ్యాచ్‌కు రిఫరీగా రిచర్డ్‌సన్‌ను నియమించినట్లు PCB సభ్యుడు చెప్పారని PTI కథనం ప్రచురించింది.
News September 17, 2025
సిద్దిపేట: చిరుత సంచారంపై క్లారిటీ

గౌరవెల్లిలో చిరుత సంచరిస్తుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు స్పందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సిద్ధార్థరెడ్డి బృందం రైతు జక్కుల రాజు వ్యవసాయ పొలాన్ని పరిశీలించింది. అక్కడి కాలి ముద్రలు హైనా లేదా జాకబ్ జంతువులవిగా గుర్తించారు. ఆ జంతువుల్లో కొన్ని పులిని పోలి ఉంటాయని, చిరుత పంజా చాలా పెద్దగా ఉంటుందని అధికారులు వివరించారు.
News September 17, 2025
భూమనకు తిరుపతి నేలపై నడిచే అర్హత లేదు: మంత్రి స్వామి

AP: తిరుమల విషయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి DBV స్వామి అభిప్రాయపడ్డారు. YCP నేత భూమనకు శ్రీవిష్ణువు, శని దేవుని విగ్రహానికి తేడా తెలియదా అని నిలదీశారు. ఆయనకు తిరుపతి నేలపై నడిచే అర్హత లేదని ధ్వజమెత్తారు. వేంకన్న పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలపై YCP నేతలు నిత్యం విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకన్నతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవన్నారు.