News March 27, 2025

చిత్తూరు: వెబ్ సైట్‌లో టీచర్ల సీనియారిటీ జాబితా

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ టీచర్ల జనరల్ సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. జిల్లాలో పని చేస్తున్న హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లు.. జనరల్ సీనియారిటీ జాబితాను సరిచూసుకోవాలన్నారు. అభ్యంతరాలపై 29వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలన్నారు.

Similar News

News March 1, 2026

రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.

News March 1, 2026

చిత్తూరు: HPV వ్యాక్సిన్‌పై అవగాహన

image

సర్వైకల్ క్యాన్సర్ వ్యాపించకుండా 14 ఏళ్లలోపు బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న సర్వేలో 4185 మంది క్యాన్సర్ అనుమానితులను గుర్తించారు. ఈ వ్యాక్సిన్ 18,500 మంది బాలికలకు అందించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు.

News March 1, 2026

చిత్తూరు: చెత్త ఇస్తే డబ్బులు.. ఎంతో తెలుసా.?

image

పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం నెలలో ఒకరోజు పంచాయతీల పరిధిలో ఈ వాహనం పర్యటిస్తుందని అధికారులు తెలుపుతున్నారు. వాహనాలకు అందజేస్తే పాత ఇనుముకు కేజీ రూ. 20, అల్యూమినియం రూ. 120, స్టీల్ రూ.40, పేపర్లు రూ.15, పుస్తకాలు, అట్టపెట్టెలు రూ.10, ప్లాస్టిక్ రూ.20 చొప్పున చెల్లిస్తారని పేర్కొంటున్నారు.