News March 27, 2025

శ్రీగిరిపై నేటి నుంచే ఉగాది మహోత్సవాలు

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు ఐదు రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలకు ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాలలో ప్రారంభ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాయంత్రం సాయంకాలార్చనలు, చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Similar News

News February 27, 2026

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌ 28 ఆఫీసర్ QA,అసిస్టెంట్ మేనేజర్, తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, డిగ్రీ (MLT, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, PG(సైకాలజీ), MBA, B.Pharm, MSW, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com

News February 27, 2026

కోళ్లకు అంతర్గత, బాహ్య పరాన్నజీవులతో కలిగే ముప్పు

image

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్‌లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.

News February 27, 2026

మార్చి 2 నుంచి ఆరోగ్య పరీక్షలు

image

TG ప్రభుత్వం మార్చి 2 నుంచి జూన్ 9 వరకు(100D) ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేయనుంది. తొలిదశ(మార్చి 2-31)లో గర్భిణులు, తల్లీశిశువులు, వృద్ధుల సేవలకు ప్రాధాన్యం ఇస్తారు. స్కూళ్లు, అంగన్వాడీల్లో శిబిరాలు నిర్వహిస్తారు. రెండో దశ(APR 1-15)లో దీర్ఘకాలిక వ్యాధులు, మూడో దశ(APR 16- మే15)లో వేసవి ఆరోగ్య సమస్యలపై చర్యలు తీసుకుంటారు. నాలుగో దశ(మే 16-జూన్ 9)లో ప్రైమరీ హెల్త్ సెంటర్లను బలోపేతం చేస్తారు.