News March 27, 2025
మంచిర్యాల: డీసీసీ అధ్యక్షురాలిగా మళ్లీ సురేఖ..?

కాంగ్రెస్ TG ఇన్‌ఛార్జ్ మీనాక్షి పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. నిన్న ఢిల్లీలో DCCలతో భేటీ అయ్యారు. కేడర్ ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామని ఆరా తీశారు. జిల్లాల్లో పార్టీని అన్నిస్థాయుల్లో ప్రక్షాళనపై చర్చించినట్లు తెలిసింది. అయితే DCC పదవి మళ్లీ సురేఖకే కట్టబెడతారా.. లేక ఇతరులకు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. రేసులో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌తో పాటు పలువురు ఉన్నట్లు సమాచారం.
Similar News
News February 18, 2026
ఖమ్మం: రైతులకు ‘యాప్’ సోపాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫెర్టిలైజర్ యాప్ నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగుకు 72వేల మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాలో 22వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా.. రెండు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 78వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. పట్టాదారు పాసుపుస్తకాలు లేని దేవదాయ, కాందిశీకుల భూముల సాగుదారులకు యూరియా అందడం లేదు. సెల్ ఫోన్ లేని రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
News February 18, 2026
మార్కాపురం జిల్లా మెడికల్ విద్యార్థిని సూసైడ్

మార్కాపురం జిల్లాలో మెడికల్ విద్యార్థిని సూసైడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు (D) గూడూరు(M) పెంచికలపాడులోని విశ్వభారతి మెడికల్ కాలేజీ సోనిక(22) సూసైడ్ చేసుకుంది. తర్లుపాడుకు చెందిన సోనిక పారామెడికల్ అనస్థీషియా ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండి మంగళవారం హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం SI అఖిల్ కేసు నమోదు చేశారు.
News February 18, 2026
ఊట్కూర్: జాతీయ స్థాయి రెజ్లింగ్‌లో కేజీబీవీ విద్యార్థినుల విజయం

ధన్వాడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) విద్యార్థినులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ నెల 15న న్యూఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ రెజ్లింగ్ పోటీల్లో కె.గీత రజత పతకం సాధించగా, నాగలక్ష్మి కాంస్య పతకం గెలుచుకొని పాఠశాలకు కీర్తి తెచ్చారు. విద్యార్థినుల విజయంపై జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి రవికుమార్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కల్పన, పీటీ, పీడీలు అభినందించారు.


