News March 25, 2024
అందరి చూపు కాటంరెడ్డి వైపే

మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఇటీవల విష్ణుతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. ఇవాళ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. విష్ణు మాత్రం పోటీలో ఉంటానంటూ ప్రచారంలో దూసుకెళుతున్నారు.
Similar News
News January 14, 2026
నెల్లూరు జిల్లాలో 1216 టీచర్ పోస్టులు ఖాళీ

నెల్లూరు జిల్లాలో 1,216 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. SA పోస్టులను 70 శాతం ప్రమోషన్స్‌తో, 30 శాతం DSCతో భర్తీ చేస్తారు. SAలు తెలుగు(54), సంస్కృతం(3), ఉర్దూ(22), హిందీ(35), ఆంగ్లం(44), MATHS(40), PS(22), BS(47), SS(64), PET(27), స్పెషల్ ఎడ్యుకేషన్(20) ఖాళీలు ఉన్నాయి. SGT కింద 786 పోస్టులు ఉండగా వీటిని DSC-2026లో భర్తీ చేసే అవకాశం ఉందని DEO బాలాజీ రావు వెల్లడించారు.
News January 14, 2026
నెల్లూరు: కయ్యానికి.. కొకొరోకో..!

సంక్రాంతి అంటే.. సరదా. కానీ సరదా మాటున ‘కోడి’ పందేలు నిర్వహించడం, వేలకు వేలు ఖర్చు చేయడం, కోళ్లను హింసించడం జరుగుతోంది. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, పెన్నా పరివాహకం పొట్టేపాలెం, కోవూరు వంటి ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశం ఉంది. విడవలూరు (M) రామతీర్ధం, పట్టపు పాలెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతాయిని సమాచారం.