News March 27, 2025

ఖమ్మం: భవనం కూలిన ఘటనలో భద్రాచలంవాసి మృతి.. (UPDATE)

image

భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్‌లో బుధవారం <<15895820>>భవనం కూలిన ఘటన<<>>లో 9 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. రాత్రి రెండు గంటల సమయంలో శిథిలాల్లో చిక్కుకున్న భద్రాచలానికి చెందిన చల్లా కామేశ్వరరావును సహాయక బృందాలు వెలికితీశాయి. కాగా, ఆ సమయంలో అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కింద ఉపేంద్ర అనే వ్యక్తిని కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 4, 2025

పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్ శ్రీజ

image

రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. విద్యార్థుల హాజరు శాతంపై దృష్టి సారించాలని, వెనుకబడిన వారికి అదనపు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. హాజరు శాతం 90కి పైగా ఉండేలా తల్లిదండ్రులతో నిరంతరం ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు.

News November 4, 2025

6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు: అ.కలెక్టర్

image

ఈనెల 6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం పత్తి కొనుగోలు పై మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, జిన్నింగ్ మిల్ యాజమాన్యం, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ పిలుపుమేరకు సీసీ కొనుగోలు కేంద్రాలకు ఆ రోజు పత్తి తీసుకురావద్దని సూచించారు.

News November 4, 2025

మాన్యువల్ స్కావెంజింగ్ రహిత జిల్లాగా ఖమ్మం: కలెక్టర్

image

సుప్రీంకోర్ట్ ఆదేశాలతో జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్ల పరిశీలన చేపట్టినట్లు, ఖమ్మం జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు కనుగొనలేదని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం జిల్లా మాన్యువల్ స్కావెంజింగ్ రహితంగా ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి స్కావెంజర్ల పరిశీలన నిశితంగా పరిశీలించారన్నారు.