News March 25, 2024

మా బౌలర్లు అదరగొట్టారు: గిల్

image

ముంబైతో మ్యాచ్‌లో సాయి సుదర్శన్ తమకు బ్యాటింగ్ ఎలా చేయాలో చేసి చూపించాడని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నారు. అతని సహకారంతో మంచి లక్ష్యాన్ని నిర్దేశించగలిగామని పేర్కొన్నారు. పేసర్లతో పాటు స్పిన్నర్లూ రాణించడంతోనే విన్నింగ్ రేసులో నిలువగలిగామని చెప్పారు. మంచు ప్రభావం ఉన్న సమయంలోనూ తమ బౌలర్లు అదరగొట్టారని ప్రశంసించారు. కాగా 39 బంతుల్లో 45 రన్స్ చేసిన సుదర్శన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.

Similar News

News January 12, 2026

2026లో యుగాంతం.. నిజమెంత?

image

కొత్త ఏడాది ప్రారంభమైన ప్రతిసారీ ‘యుగాంతం’ థియరీలు ముందుకొస్తుంటాయి. బాబా వాంగ వంటి వారిని పేర్కొంటూ ఊహాగానాలు పుట్టుకొస్తాయి. AI ప్రాముఖ్యత, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి దానికి సంకేతాలంటూ SMలో స్టోరీలు ఇప్పుడు వైరలవుతున్నాయి. ఏలియన్స్ భూమిని ఆక్రమిస్తారనే చర్చా జరుగుతుంది. వీటిలో ఏమాత్రం నిజం ఉండదని చరిత్ర చెబుతోంది. కేవలం SM ఆల్గారిథమ్ వల్లే ఇవి ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి.

News January 12, 2026

RVNLలో ఇంజినీర్ పోస్టులు

image

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌(<>RVNL<<>>) 25సైట్ ఇంజినీర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించనుంది. పోస్టును బట్టి బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. ST/SC/EWS కేటగిరీకి చెందినవారు జనవరి 13న, OBCవారు జనవరి 14న, UR అభ్యర్థులు జనవరి 15న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వెబ్‌సైట్: https://rvnl.org

News January 12, 2026

ఎంగేజ్మెంట్ చేసుకున్న శిఖర్ ధవన్

image

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేయసి సోఫీతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు చేతికి రింగ్ ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2023లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.