News March 27, 2025
మందమర్రి: రెండు లారీలు ఢీ.. ఒకరికి గాయాలు

మందమర్రి సమీపంలోని సోమగూడెం హైవేపై తెల్లవారుజామున రెండు లారీలు ఒకటి వెనుక ఒకటి ఢీకొనగా వెనుక లారీ క్యాబిన్లో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు గంటల నుంచి గాయపడ్డ వ్యక్తి బయటికి రావడానికి నానా యాతన పడుతున్నాడు. విషయం తెలుసుకున్న108 సిబ్బంది, పోలీస్ శాఖ, హైవే సిబ్బంది అక్కడి చేరుకొని క్షతగాడ్రుడిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Similar News
News January 2, 2026
IIM బుద్ధగయలో నాన్ టీచింగ్ పోస్టులు

<
News January 2, 2026
వామకుక్షితో ఆరోగ్యం, ఆనందం

ఎడమ వైపు పడుకుంటే జీర్ణాశయం ఆకృతి కారణంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గుండెపై ఒత్తిడిని తగ్గించి, రక్తప్రసరణను సాఫీగా మారుస్తుంది. కాలేయం, కిడ్నీలు బాగా పనిచేసి వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఈ భంగిమ మెదడును చురుగ్గా ఉంచి, మధ్యాహ్నం వచ్చే అలసటను తగ్గిస్తుంది. గర్భిణీలకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. SHARE IT
News January 2, 2026
మున్సిపల్ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్.. పేరు చెక్ చేసుకోండి

తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు రిలీజ్ అయ్యాయి. ఈనెల 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, 10న తుది జాబితా విడుదల చేయనున్నారు. మొత్తం 45 లక్షల మందిపైగా ఓటర్లు ఉన్నారు. అందులో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు ఉన్నారు. మున్సిపాలిటీల్లో 2,690, కార్పొరేషన్లలో 366 వార్డులు ఉన్నాయి. https://tsec.gov.inలో పేరు చెక్ చేసుకోవచ్చు.


