News March 27, 2025
దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్‌కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది.
Similar News
News July 7, 2025
రోడ్డు ప్రమాదంలో ఆపరేషన్ సింధూర్ జవాన్ మృతి

పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సింధూర్‌లో సేవలందించిన ఆయన, కుటుంబంతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నల్గొండ దగ్గర వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో నాగేశ్వరరావు కుమారుడు అవినాశ్ అక్కడికక్కడే మృతి చెందగా, నాగేశ్వరరావు చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
News July 7, 2025
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ప్రభుత్వం ఆమోదం

AP: అమరావతి <<16882676>>క్వాంటమ్ వ్యాలీ<<>> డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2035 నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్‌గా క్వూ-చిప్-ఇన్‌ను వచ్చే 12 నెలల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించింది.
News July 7, 2025
కాసేపట్లో ఐసెట్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు 71, 757 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,398 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా పొందవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌పై హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి.